Friday, May 15, 2015

చైనాలో మోడీ సెల్ఫిలు




చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో, చైనా ప్రధాని లీకెకియాంగ్‌తో సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. శుక్రవారం మోదీ బీజింగ్‌లోని టెంపుల్ ఆఫ్ హెవెన్‌లో భారతీయ, చైనా విద్యార్థులో ఏర్పాటు చేసిన యోగా- థాయ్ ఛాయ్ సంయుక్త కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చైనా ప్రధాని లీకెకియాంగ్ కూడా వచ్చారు. అక్కడ సరదాగా లీకెకియాంగ్‌తో సెల్ఫీ దిగిన మోదీ.. 'లీకు ధన్యవాదాలు.. ఇది సెల్ఫీ టైమ్' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అలాగే యోగాలో పాల్గొన్న చిన్నారులతో కూడా మోదీ సెల్ఫీలు దిగారు.

No comments: