Friday, May 15, 2015


 భార్యే హంతకురాలు 

 



నిద్రపోతున్న భర్తను కాళ్లు, చేతులు కట్టేసి ముఖం చుట్టూ పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడానికి ప్రయత్నించిందో మహిళ. అంతే కాదు, ఆ తర్వాత కట్టెతో కొట్టి, కొడవలితో దాడి కూడా చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్ లో భర్త కన్నన్ తో గొడవ జరగడంతో వంజియమ్మళ్ అనే మహిళ అతడిని హతమార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. భార్య తనను అశక్తుడిని చేసి చంపేస్తుండటంతో అతడు అరవసాగాడు. అతడి అరుపులు విన్న పిల్లలు లేచి, వాళ్లూ భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచి వెంటనే అక్కడకు చేరుకుని అతడిని కాపాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత వంజియమ్మాళ్ పోలీసుల వద్ద లొంగిపోయింది. తన భర్త పెట్టే చిత్రహింసలను భరించలేకే ఇలా చేసినట్లు ఆమె తెలిపింది.

No comments: