బాహుబలి కాపీ మూవీ
బాహుబలి కాపీ మూవీ అంటూ రిలీజ్‌కి ముందు ప్రచారం చేసిన సినీ విమర్శకులు ఏమైయ్యారు.? ఒక చేయని చూసి, యుద్ధ సన్నివేశాలు చూసి ఇది కాపీ సినిమా అని కామెంట్స్ చేసిన క్రిటిక్స్ ఎక్కడ..? కాపీ కాని అన్నింటినీ కాపీ అని అసలు కాపీని వదిలేశారు. ఇది తమ అభిప్రాయాలను ఇద్దరులపై రుద్దే మూవీ క్రిటిక్స్ ప్రతిభ. అసలు బాహుబలి సినిమా మొత్తం కాపీనే అంటా. ఇది స్వయంగా రాజమేళినే చెప్పారు. మహాభారతం ఆధారంగా ఈ సినిమా తీశానని ప్రకటించారు. ఇప్పటికే మహాభారతంపై అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాహుబలి కూడా వచ్చింది. సో ఇది కూడా వాటి కాపీ అనడంలో తప్పేంలేదు. కాని దమ్మంతా డైరెక్టర్‌లోనే ఉంది. కాపి కొట్టడం కాదు. కొట్టిన కాపిని బాగా తయారు చేయాలి. అదీ రాజమౌళి గొప్పదనం. అందుకే బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.WEB NEWS
news you want
Friday, July 17, 2015
Friday, May 15, 2015
భార్యే హంతకురాలు
నిద్రపోతున్న భర్తను కాళ్లు, చేతులు కట్టేసి ముఖం చుట్టూ పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడానికి ప్రయత్నించిందో మహిళ. అంతే కాదు, ఆ తర్వాత కట్టెతో కొట్టి, కొడవలితో దాడి కూడా చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్ లో భర్త కన్నన్ తో గొడవ జరగడంతో వంజియమ్మళ్ అనే మహిళ అతడిని హతమార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. భార్య తనను అశక్తుడిని చేసి చంపేస్తుండటంతో అతడు అరవసాగాడు. అతడి అరుపులు విన్న పిల్లలు లేచి, వాళ్లూ భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచి వెంటనే అక్కడకు చేరుకుని అతడిని కాపాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత వంజియమ్మాళ్ పోలీసుల వద్ద లొంగిపోయింది. తన భర్త పెట్టే చిత్రహింసలను భరించలేకే ఇలా చేసినట్లు ఆమె తెలిపింది.
చైనాలో మోడీ సెల్ఫిలు
చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో, చైనా ప్రధాని లీకెకియాంగ్‌తో సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. శుక్రవారం మోదీ బీజింగ్‌లోని టెంపుల్ ఆఫ్ హెవెన్‌లో భారతీయ, చైనా విద్యార్థులో ఏర్పాటు చేసిన యోగా- థాయ్ ఛాయ్ సంయుక్త కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చైనా ప్రధాని లీకెకియాంగ్ కూడా వచ్చారు. అక్కడ సరదాగా లీకెకియాంగ్‌తో సెల్ఫీ దిగిన మోదీ.. 'లీకు ధన్యవాదాలు.. ఇది సెల్ఫీ టైమ్' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అలాగే యోగాలో పాల్గొన్న చిన్నారులతో కూడా మోదీ సెల్ఫీలు దిగారు.
Subscribe to:
Posts (Atom)


